W.G: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నరసాపురం మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. పట్టణంలో కొనసాగుతున్న చెత్త డంపింగ్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆర్డీవో దాసిరాజుతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పట్టణ శుభ్రత పనులు మరింత మెరుగుపడేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.