AP: విశాఖపట్నం బీచ్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.