SKLM: ప్రభుత్వ శాఖల పనితీరులో వేగం పెంచి, కీలక పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ఆధారంగా లక్ష్యాలను సమయపాలనతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ఆయన నిర్వహించారు. శాఖల వారీగా సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.