క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. క్లెయిమ్ చేయని నగదును దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. ‘మీ డబ్బు.. మీ హక్కు’ అని పేర్కొన్నారు. బ్యాంకుల్లో రూ.78,000 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో రూ.3 వేల కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లను మోదీ పంచుకున్నారు.