పినపాక : గురువారం జరగబోయే పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సామాగ్రి మండల కేంద్రంలోని పినపాక జూనియర్ కళాశాలకు చేరింది. ఈ సామగ్రిని మండల అధికారులు బుధవారం పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి కేంద్రానికి సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ సిబ్బంది తమ సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.