SKLM: పలాస (M) మహేంద్ర తనయ ఆప్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల కాలనీలో సుమారు రూ. 3.85 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత TDP ప్రభుత్వ హయాంలో నిర్వాసితులకు ఇచ్చిన కాలనీలలో మౌలిక వసతులను వైకాపా ప్రభుత్వం విస్మరించిందని, కూటమి ప్రభుత్వంలో తిరిగి పనులు ప్రారంభించామని తెలిపారు.