W.G: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన ‘కోటి సంతకాల’ సేకరణలో భాగంగా తణుకు నియోజవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులతో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బుధవారం భీమవరం బయలుదేరి వెళ్ళారు. తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా 82,350 సంతకాలు సేకరించినట్లు చెప్పారు. వీటిని బుధవారం వాహనంలో తీసుకుని ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.