TG: బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతిపట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ భౌతికదాడులు చేస్తోందన్నారు.