WGL: నర్సంపేట పట్టణంలోని మటన్ మార్కెట్ సమీపంలో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మృతి చెందారు. మృతదేహాన్ని నర్సంపేట మార్చురీలో భద్రపరిచారు. చలికి తట్టుకోలేకనే మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మృతునికి సంబంధించినవారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.