ADB: ఈనెల 11న నిర్వహించనున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పోలీస్ సిబ్బందితో సమావేశమై ఆమె మాట్లాడారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.