అన్నమయ్య: రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు కోరారు. రైల్వే కోడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన నిరసనలో పాల్గొని, అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించారు.