AP: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు CID, ACB డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారం, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తును కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసులో సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది.