MDK: రామాయంపేట మండలం దామర చెరువు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పిట్ల సాయితేజ అనే యువకుడు బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.