E.G: జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఇరిగేషన్, భూగర్భ జలాలు, డ్వామా, సచివాలయ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో భూగర్భ జలాల గణాంకాలపై నిశితంగా దృష్టి సారించాలన్నారు.