ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. వైద్యులకు స్థిరమైన పని వేళలు ఉండాలని ఆస్పత్రి యాజమాన్యాలకు సూచించింది. షిప్ట్‌ల మధ్య అవసరమైన విశ్రాంతి సమయం ఉండాలని తెలిపింది. వైద్యులకు ఓవర్ టైమ్ విధులు కేటాయించవద్దని పేర్కొంది. వైద్యులు అలసిపోతే రోగులకు ప్రమాదమని హెచ్చరించింది. ఆస్పత్రిలో తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.