VSP: కశింకోట సీఐ స్వామినాయుడిపై చర్యలు తీసుకోవాలని ఎదురుపర్తి గ్రామానికి చెందిన గొంతిన నానాజీ కోరారు. బుధవారం డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన భూమిని కబ్జా చేసేందుకు జనసేన పార్టీ నాయకులు కొందరు అధికారులుతో కలిసి ప్రయత్నిస్తున్నారని.. దానికి సీఐ స్వామినాయుడు మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.