KDP: మైదుకూరు మండలం వనిపెంట ఇత్తడి పరిశ్రమ కార్మికుల సాధక బాధలను స్వయంగా తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మైదుకూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఏపీ రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. వనిపెంట ఇత్తడి పరిశ్రమ సమస్యలను, కార్మికుల సాధక బాధలను వివరించారు.