కృష్ణా: తాడిగడపలో 432 మంది ఇంటి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం అందజేసిన రూ. 2,50,000 సబ్సిడీ ధ్రువపత్రాలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రజల ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.