SKLM: మొదటి రోజే శత శాతం పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాలు వయసుగల పిల్లలు 1.55 లక్షల మంది ఉన్నారని వివరించారు.