NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను నిర్ణీత సమయంలో ప్రారంభించి, ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా ముగించాల్సిందిగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్దూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.