WNP: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా ఆయా మండలాలలో స్థానిక సెలవు ప్రకటించినట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం తెలిపారు. జిల్లాలోని పెద్దమందడి, ఏదుల, ఘనపూర్, గోపాల్ పేట, రేవల్లి మండలాలలో గురువారం మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.