HYD: కుటుంబ సమస్యల కారణంగా ధర్మారెడ్డి కాలనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కోడివేడు వెంకన్న (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు KPHB పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.