NLG: జిల్లాలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు చేపట్టామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఎన్నికల రోజు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం కట్టంగూర్ ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు.