NLG: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న దేవరకొండ డివిజన్లోని 9 మండలాలలో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకురాలు కోర్రా లక్ష్మీ సమక్షంలో కలెక్టర్ త్రిపాఠి బుధవారం తన చాంబర్లో ఈ కార్యక్రమం చేపట్టారు. 2206 పోలింగ్ కేంద్రాలకు, 2647 పీవో లు, 2959 వోపీవోలను విధుల్లో నియమించారు.