ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితిపైన చర్చించారు. ఇరు దేశాల నేతలు ఉగ్రవాదాన్ని ఖండించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. గాజా శాంతి ప్రణాళికకు మోదీ మద్ధతు పలికారు. శాశ్వత శాంతి కోసం చేసే ప్రయత్నాలకు ఎల్లప్పుడు మద్దతిస్తామని మోదీ పేర్కొన్నారు.