ADB: ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోనీ ధర్మసాగర్లో బుధవారం సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా కొంత మందితో కలిసి సర్పంచ్ అభ్యర్థి భర్త కనక దుండిరావు ప్రచారం నిర్వహించాడు. సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీం తనిఖీ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఈ సాయన్న తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.