కృష్ణా: పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 44 మందికి CMRF ద్వారా వైద్య ఖర్చులకు రూ.40 లక్షలు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెక్కులు అందచేశారు.