SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాలలో 6 రహదారుల అభివృద్ధికి రూ.9.69 కోట్ల మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి సహకరించిన సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.