W.G: పెనుగొండ టీటీడీ కళ్యాణ మండపం వద్ద బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఈ నెల 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 4వరకు విశాఖలో జరిగే సీఐటీయూ మహాసభల గోడ పత్రికలను కార్మికులు ఆవిష్కరించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడారు. విశాఖ వేధికగా జరిగే సమావేశాలను కార్మికులు విజయవంతం చేయాలన్నారు.