ELR: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తనదైన శైలిలో ఉపయోగించుకుంటున్నారు. పార్లమెంట్ సమావేశాలలో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా వివిధ శాఖల మంత్రులను కలుస్తూ ఏలూరు పరిధిలోని పెండింగ్ పనులను, అర్జీలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఏలూరు పార్లమెంటు పరిధిలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పనుల సాధనకు కృషి చేస్తున్నారు.