KMM: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్ణీత సమయానికి పూర్తి కావాలని, నాణ్యతలో రాజీ పడొద్దని Dy. CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కింది స్థాయిలో పనిచేసే అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలని ఆయన సూచించారు.