NZB: కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్‌లను ఎంపీ అర్వింద్ ధర్మపురి కలిశారు. నేడు ఢిల్లీలోని పార్లమెంట్ కార్యాలయంలో మంత్రులను వేర్వేరుగా కలిసి నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు సంబంధించి పలువిజ్ఞప్తులను అందజేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి జిల్లా రైల్వే స్టేషన్లో పిట్ లైన్ల ఏర్పాటు, పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా పలు రైళ్ల పొడిగించాలన్నారు.