AP: 2 రోజుల్లో పూర్తిస్థాయి ఇండిగో సేవలు అందుబాటులోకి వస్తాయని విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు 122 ఇండిగో సర్వీసులు రద్దు అయినట్లు చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు 21 లగేజీలు అప్పగించామని.. ఇంకో 6 బ్యాగులు డోర్ డెలివరీ ద్వారా ఇండిగో అందిస్తుందన్నారు.