E.G: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాజమండ్రి త్రీటౌన్ పరిధిలో సీఐ వీ.అప్పారావు తన సిబ్బందితో కలిసి బుధవారం కోరి మార్కెట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో ఓ వ్యక్తి పోలీసులను చూసి కంగారుపడి తప్పించుకునే ప్రయత్నం చేయగా, అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించారు. ఇతడు పలు వాహనాలు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు