NDL: డోన్ డివిజన్ విద్యుత్ కార్యాలయం, అకౌంట్ ఆఫీసు, ఎస్పీఎం (ట్రాన్స్ఫార్మర్ రిపేర్) లను నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివిజనల్ ఇంజనీర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, వినియోగదారుల సేవల మెరుగుదలకు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు.