WGL: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏసీపీ అంబటి నరసయ్య ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, నల్లబెల్లి, ఇల్లంద గ్రామాల్లో బుధవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిబాబు సహా పోలీసులు పాల్గొన్నారు.