ASR: డుంబ్రిగూడలో ఈనెల 15న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ త్రివేణి స్థానిక విలేకరులకు బుధవారం తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ఐటీడీఏ పీవో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగులతో పాటు యువత పాల్గొని రక్తదానం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.