ATP: గుంతకల్లు పట్టణంలోని డాక్టర్ సరోజినీ నాయుడు పురపాలక ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత గా ఉందా అంటూ విద్యార్థులకు ఆరా తీశారు. తథానంతరం పదవ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడుగా మారి పాఠాలు బోధించారు.