విశాఖపట్నంలో డిసెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ‘సరస్’ ఎగ్జిబిషన్ మహిళల స్వయం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శన కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 600 సభ్యులతో 250 స్టాళ్లు ఏర్పాటు అవుతున్నాయన్నారు.