WGL: నల్లబెల్లి (M) లోని రామతీర్థం, బోలోని పల్లె, రంగాపురం ముచింపుల గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం ఇవాళ దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CM సహకారంతో గ్రామాలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా ప్రజలను కోరారు.