SKLM: రైతుల ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో సివిల్ సప్లయర్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం తీసుకునే ప్రతి నిర్ణయం కఠినంగా అమలు చేయాలని అన్నారు. అధికారులు పూర్తిస్థాయి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.