VZM: విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి సాధించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ సూచించారు. దత్తిరాజేరు జడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించిన ఆయన, ఐఏఎస్ అధికారి మిత్తిరెడ్డి కుర్మారావు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన మెరిట్ అవార్డులను విద్యార్థులకు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన 5గురు విద్యార్థులను సన్మానించారు.