ఎన్నికల సంఘాన్ని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ‘ఓటర్ల జాబితా సవరణ భాద్యత ఈసీది. SIR ప్రక్రియ కొత్తది కాదు.. ఎప్పటి నుంచో కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో పలుమార్లు ఓటర్ల సవరణ జరిగింది. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది చాలా కీలకం. చనిపోయిన వారి పేర్లు కూడా తొలగించవద్దని చెబుతున్నారా?’ అని ప్రశ్నించారు.