ఇండిగో సంక్షోభం భారత దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. విమానాలు రద్దవడంతో రాజధాని ఢిల్లీలో పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. అలాగే, అన్ని రాష్ట్రాల్లోనూ పర్యాటకుల సంఖ్య దాదాపు 50 నుంచి 60 శాతం వరకు తగ్గిపోయిందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని ఫలితంగా హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలు వంటి అనుబంధ రంగాలలో కూడా నష్టం వాటిల్లి, ఆర్థిక వ్యవస్థపై పరోక్ష ప్రభావం పడనుంది.