BDK: చుంచుపల్లి మండలం వెంకటేశ్ ఖని గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. సింగరేణి కోల్‌మైన్ విస్తరణ కారణంగా 2022లో ఖాళీ చేయించిన ఈ గ్రామంలో ప్రస్తుతం ఒక్క ఓటరు కూడా లేరు. అయినప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో గ్రామ పంచాయతీగా కొనసాగుతున్న ఈ గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ప్రజలు లేని గ్రామానికి ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది.