SKLM: ప్రస్తుత సీజన్లో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విశ్వనాధ్ గంగాధర్ అన్నారు. బుధవారం కాకరాపల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్యశిభిరం నిర్వహించారు. తనిఖీలు చేసి మందులు పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఇంటికి వెళ్లి వ్యాధికి గల కారణాలను తెలుసుకున్నారు.