KNR: ఇల్లందకుంట మండలం భోగంపాడు గ్రామ సర్పంచ్‌గా ఏలేటి నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మల గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యురాలిగా పనిచేశారు. భోగంపాడు సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ మహిళకు రాగా ముగ్గురు పోటీలో ఉన్నారు. గ్రామాభివృద్ధి దృష్ట్యా ఏలేటి నిర్మలను ఏకగ్రీవం చేశారు. ఇక 8 వార్డులకు గాను 7 వార్డులు కూడా ఏకగ్రీవం కావడం గమనార్హం.