KNR: హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామంలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం మొదలైంది. మండలంలోని రాంపూర్ గ్రామంలో 12 వార్డులు ఉండగా అందులో ఐదు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఏడు వార్డుల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే సర్పంచ్ అభ్యర్థులు కులాల వారీగా ఓట్లు అభ్యర్థిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.