ADB: నార్నూర్ మండలంలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పోలింగ్ ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రానికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. ప్రజలు ఉదయం 7 గంటల నుంచి వచ్చి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.