గద్వాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న 4 మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదలయింది. వాటిలో 14 జీపీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 92 పంచాయతీలలో సర్పంచ్, 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ 92 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,31,679 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 66,994 మంది మహిళలు, 64,684 మంది పురుషులు ఉన్నారు.